ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 68 కరవు మండలాలు ఇవే..

నల్గొండ, ఈ క్షణం ప్రతినిధి: తెలంగాణలో ఖరీఫ్‌–2026 సీజన్‌లో నెలకొన్న కరవు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 68 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఇందులో 25 మండలాలను తీవ్ర కరవు, 43 మండలాలను మోస్తరు కరవు ప్రభావిత మండలాలుగా వర్గీకరించింది. ఈ మేరకు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ జీఓ ఎంఎస్‌ నం.03ను ఈ నెల 24న జారీ చేసింది.

నల్లగొండ జిల్లాలో 28 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. వీటిలో 20 మండలాలు తీవ్ర కరవు, ఎనిమిది మండలాలు మోస్తరు కరవు ప్రభావానికి గురైనట్లు జీఓలో పేర్కొన్నారు.

  • నకిరేకల్
  • చండూరు
  • మర్రిగూడ
  • చింతపల్లి
  • నాంపల్లి
  • నిడమనూరు
  • దామరచర్ల
  • అడవిదేవులపల్లి
  • తిరుమలగిరి సాగర్
  • పెద్దవూర
  • పెద్దఅడిశర్లపల్లి
  • నేరేడుగొమ్ము
  • గట్టుప్పల్
  • దేవరకొండ
  • చందంపేట
  • గుండ్లపల్లి
  • కనగల్
  • మునుగోడు
  • నార్కట్‌పల్లి
  • శాలిగౌరారం
  • చిట్యాల
  • కేతేపల్లి
  • నల్లగొండ
  • త్రిపురారం
  • మాడుగులపల్లి
  • వేములపల్లి
  • తిప్పర్తి
  • మిర్యాలగూడ

సూర్యాపేట జిల్లాలో 23 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అనంతగిరి, చిలుకూరు, పాలకీడు, చింతలపాలెం మండలాలను తీవ్ర కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించగా, మిగిలిన 19 మండలాలను మోస్తరు కరవు మండలాలుగా వర్గీకరించారు.

  • అనంతగిరి
  • చిలుకూరు
  • పాలకీడు
  • చింతలపాలెం
  • నాగారం
  • తిరుమలగిరి
  • నూతనకల్
  • జాజిరెడ్డిగూడెం
  • సూర్యాపేట
  • ఆత్మకూరు (ఎస్‌)
  • మోతె
  • చివ్వెంల
  • పెన్‌పహాడ్
  • మునగాల
  • నడిగూడెం
  • కోదాడ
  • గరిడేపల్లి
  • నేరేడుచర్ల
  • మేళ్లచెరువు
  • తుంగతుర్తి
  • మద్దిరాల
  • మట్టంపల్లి
  • హుజూర్‌నగర్

యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. తుర్కపల్లి మండలాన్ని తీవ్ర కరవు మండలంగా, మిగిలిన 16 మండలాలను మోస్తరు కరవు మండలాలుగా గుర్తించారు.

  • మోత్కూరు
  • రాజాపేట
  • మోటకొండూరు
  • యాదగిరిగుట్ట
  • భువనగిరి
  • బొమ్మలరామారం
  • బీబీనగర్
  • పోచంపల్లి
  • రామన్నపేట
  • అడ్డగూడూరు
  • ఆలేరు
  • ఆత్మకూరు (ఎం)
  • చౌటుప్పల్
  • గుండాల
  • నారాయణపూర్
  • వలిగొండ
జిల్లా పేరుమొత్తం మండలాలుతీవ్ర కరవుమోస్తరు కరవు
నల్లగొండ28208
సూర్యాపేట23419
యాదాద్రి భువనగిరి17116
మొత్తం682543

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కరవు నోటిఫికేషన్‌ ప్రచురించిన తేదీ నుంచి ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది. అంతకుముందే రద్దు చేస్తే మినహాయింపు ఉంటుంది. సంబంధిత జిల్లా కలెక్టర్లు జిల్లా గెజిట్‌లో నోటిఫికేషన్‌ ప్రచురించాలని ప్రభుత్వం ఆదేశించింది. కరవు ప్రభావిత మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, లబ్ధిదారులు, ఖర్చుల వివరాలను నమోదు చేసి నివేదికలు సమర్పించాలని సూచించింది.

కరవు మండలాల్లోని రైతులు రుణ సదుపాయాలు పొందేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ నోటిఫికేషన్‌ వీలు కల్పిస్తుంది. అయితే, సంబంధిత మండలాల్లోని మున్సిపల్‌, పట్టణ ప్రాంతాలను కరవు నోటిఫికేషన్‌ నుంచి తొలగించాలని, తాగునీటి సరఫరా విషయంలో మాత్రం వాటిని కరవు ప్రభావిత ప్రాంతాలతో సమానంగా పరిగణించాలని జీఓలో పేర్కొన్నారు.