జిల్లా వార్తలు

Haliya Community Health Center Nalgonda Collector Chandrasekhar Inspection

హాలియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను త్వరగా ప్రారంభించాలి

హాలియా, ఈక్షణం: హాలియాలో నూతనంగా నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మిగిలిపోయిన పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని త్వరగా ప్రారంభించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంగళవారం అనుముల మండలం…

Huzurnagar Municipality Congress Revolt Funds Issue

Breaking News: హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌లో తిరుగుబాటు!

హుజూర్‌నగర్‌, ఈక్షణం: హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. సొంత పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్‌ చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌ గౌడ్‌ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో సుమారు రూ.6 కోట్ల నిధుల వినియోగంపై లెక్కలు వెల్లడించాలని పట్టుబడుతూ మంగళవారం నిర్వహించిన…

Nakrekal El Nino Awareness Meeting Gutta Sukhender Reddy Nalgonda

ఎల్ నినో పరిస్థితులను సమష్టిగా ఎదుర్కొందాం: గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపు

నకిరేకల్ ఈక్షణం, నవంబర్ 04: రాష్ట్రంలో ఎల్‌నినో (El Nino) ప్రభావంతో తలెత్తుతున్న సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్‌లో ‘ఎల్ నినో –…

Manuguru Conductor Pravalika Death Bus Change Issue

చిల్లర వివాదం.. మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి తోసేసిన ప్రయాణికురాలు

మణుగూరు ఈక్షణం, నవంబర్ 03: కేవలం చిల్లర డబ్బుల (Change) విషయంలో జరిగిన చిన్న వాగ్వాదం ఒక ప్రాణాన్ని బలిగొంది. టికెట్ మిగులు డబ్బులు ఇప్పుడే ఇవ్వాలంటూ ఓ ప్రయాణికురాలు చేసిన దుర్మార్గపు పనికి ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ అత్యంత విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలో…

Asifabad Headmaster Caught Drinking Alcohol School Tiryani

Video: బడిలో మద్యం తాగుతూ పట్టుబడ్డ హెడ్‌మాస్టర్..

ఆసిఫాబాద్ ఈక్షణం, నవంబర్ 03: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు (Headmaster) బడిలోనే మద్యం మత్తులో తూలుతూ అభాసుపాలయ్యాడు. ఏకంగా పాఠశాల వేళల్లో, విద్యార్థుల ముందే మద్యం సేవిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఈ ఘటన కుమ్రభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం…

Kadlure Sarpanch Esther Siddhu Financial Aid Tekmal Medak

శంకర్ మృతి పట్ల దిగ్భ్రాంతి: బాధిత కుటుంబానికి సర్పంచ్ బక్క ఎస్తేర్ ఆర్థిక సహాయం

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, నవంబర్ 02: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన యువకుడు శంకర్ కుటుంబాన్ని కాద్లూర్ గ్రామ సర్పంచ్ బక్క ఎస్తేర్ సిద్ధు పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి, తనవంతు ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాద్లూర్ గ్రామానికి…

Komatireddy Rajagopal Reddy, Revanth Reddy

సొంత ప్రభుత్వంపైనే రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు..?

మునుగోడు, ఈక్షణం: సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తామని మూడేళ్లుగా చెబుతున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినా ఆశించిన స్పందన లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రభుత్వ పనితీరు, నియోజకవర్గ అభివృద్ధిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో…

Nalgonda Collector Chandrasekhar Power Saving Government Offices

ప్రతి రోజు గంట పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్లు, ఫ్యాన్లు బంద్‌: కలెక్టర్

నల్గొండ ఈక్షణం, నవంబర్ 02: రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో (El Nino) తీవ్ర పరిస్థితులు, విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ పొదుపును ఉద్యమంలా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా రెడ్‌కో (REDCO)…

Komatireddy Rajagopal Reddy Munugode Funds Kaleshwaram

నేను మంత్రి, సీఎం కాకపోవచ్చు.. కానీ.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

మునుగోడు / నల్గొండ ఈక్షణం, నవంబర్ 02: తాను మంత్రి, ముఖ్యమంత్రి కాకపోవచ్చునని, కానీ వ్యక్తిగత క్యారెక్టర్, క్రెడిబిలిటీ మరియు కెపాసిటీ విషయంలో మాత్రం వారందరికంటే ఎక్కువేనని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరైడ్‌ సమస్యతో దశాబ్దాలుగా సతమతమవుతున్న మునుగోడు నియోజకవర్గంలో చిన్న నీటి వనరులు, చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం…

Minister Damodara Rajanarasimha Medical Bill Discount Medak Tekmal

ఆపదలో ఆపద్బాంధవుడిగా నిలిచిన మంత్రి దామోదర్ రాజనర్సింహ..

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, నవంబర్ 02: ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఓ వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆపద్బాంధవుడిగా నిలిచారు. క్లిష్ట సమయంలో మానవతా దృక్పథంతో స్పందించి, భారీగా వ్యయమైన ఆసుపత్రి బిల్లులో ఏకంగా రూ. 3.70 లక్షల రాయితీ ఇప్పించి బాధితులకు…